Warning: Constant WP_AUTO_UPDATE_CORE already defined in /home/u833945783/domains/teachersportal.in/public_html/wp-config.php on line 99
మనబడి నాడు-నేడు రక్షిత మంచినీటి వసతి పని మార్గదర్శకాలు విడుదల – Teachers Portal

మనబడి నాడు-నేడు రక్షిత మంచినీటి వసతి పని మార్గదర్శకాలు విడుదల

::ప్రాథమిక విద్యాశాఖ మనబడి నాడు-నేడు రక్షిత త్రాగునీటి వసతిపని – మార్గదర్శకాలు విడుదల::
“మన బడి -మన ఊరిబడి.”.ఆ బడిలో అందరం జీవితాలను సమున్నతంగా తీర్చిదిద్దుకున్నాం.మన ఊరి బడి ఎందరో మంచి మనుషులను , మనసున్న మనుషులను తీర్చిదిద్దిన పవిత్ర దేవాలయం.పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం తన భాద్యతగా గుర్తించి , అవినీతికితావులేకుండా ఆనందకర, ఆహ్లాదకర అభ్యసనల నిలయాలుగా మార్చాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం “మన బడి నాడు – నేడు “ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ 9 రకాల పనులలో ఒకటైన రక్షిత త్రాగునీటి వసతి పని అమలులో పాటించవలసిన మార్గదర్శకాలు.
మన పాఠశాలలను గమనించినప్పుడు త్రాగునీటి వసతి కింద సూచించిన వివిధ పద్ధతుల ద్వారా అందుబాటులో  వుంటుంది.
1. పంచాయతి కుళాయి / మునిసిపల్ కుళాయి
2. బోరుబావి మాత్రమే
3. పంచాయతి కుళాయి / మునిసిపల్ కుళాయి మరియు బోరుబావి
కొన్ని పాఠశాలలలో పై తెలిపిన ఏ వసతి కూడా అందుబాటులో ఉండదు:
1. కుళాయి గాని బోరుబావి గాని లేని పాఠశాలలలు
2. మంచినీటి సరఫరా పథకం అందుబాటులో లేని అలాగే బోరుబావి వేస్తే నీరుపడని పాఠశాలలలు.
నీటి వసతి అందుబాటులో లేని పాఠశాలలో  అలాగే అందుబాటులో ఉన్న పాఠశాలలో త్రాగునీటి వసతి కోసం చేయవలసిన ఏర్పాట్లు.
కుళాయి గాని బోరుబావి గాని లేనపుడు:
◼ పంచాయతి కుళాయి /మునిసిపల్ కుళాయి కనెక్షనుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి.
◼ కుళాయి కనెక్షను కోసం పంచాయతి/మునిసిపాలిటికి చెల్లించవలసిన డిపాజిట్ ను అలాగే పైపులు ,కుళాయి , ఇతర సామాగ్రిని సప్లయరు రిజిస్ట్రేషను పద్ధతి ద్వారా కొనుగోలు చేసి చెల్లింపులు చేయాలి. ఒకవేళ కుళాయి కనెక్షన్ రేటు రూ.3000 లో పై అయితే రివాల్వింగ్ ఫండ్ నుండి చెల్లించవలెను.
◼ కుళాయి కనెక్షను కోసం త్రవ్వే గుంతలకు, పైపు కనెక్షనుకు, కుళాయి బిగించడానికి కూలీ డబ్బుల చెల్లింపులు రివాల్వింగ్ ఫండ్ ద్వారా చెల్లించాలి.
◼ రివాల్వింగ్ ఫండును మొదటి విడతగా 15%, మిగిలిన కూలీ మొత్తాన్ని రెండవ విడతగా STMS ద్వారా డ్రా చేయాలి
◼ ఆ గ్రామానికి లేదా వార్డుకు సరిపోయే మంచి నీటి సరఫరా పథకము అందుబాటులో లేకపోతే బోరుబావి త్రవ్వుకోవాలి.
◼ చుట్టుప్రక్కల బోర్లు పడుతూ ఉంటే పాఠశాల ఆవరణలో బోరు పాయింట్ ను గుర్తించి 6 ఇంచుల బోరుబావి త్రవ్వించుకోవాలి.
◼ తక్కువ రేటుతో చేయగలిగిన రిగ్ ఓనరును గుర్తించి అతనిని సప్లయర్ గా రిజిస్టరు చేయాలి.
◼ అలాగే బోరుబావికి అవసరమైన పైపులు, మోటారు, పవర్ కనెక్షన్ మొదలగు వాటిని సరఫరా దారులను గుర్తించి,  STMS లో రిజిస్టరు చేసి వారి ద్వారా సామాగ్రిని కొనుగోలు చేయాలి.
బోరుబావి మాత్రమే వున్నప్పుడు:
బోరు మాత్రమే వుండికుళాయి లేకపొతే పంచాయతి/మునిసిపల్ కుళాయి కనెక్షను అదనంగా తీసుకోవచ్చు.
◼ ఇలాంటి పాఠశాలలో కుళాయి నీటిని త్రాగునీటి అవసరాలకు, వంటకు, బోరుబావి నీటిని ఇతర అవసరాలకు  వాడుకోవాలి.
◼ నీటి సామర్ధ్యం (yield) బాగా ఉన్న బోరు బావి కొంత మేర పూడిక చేరివుంటే ఫ్లషింగ్ చేసి పూడిక తొలగించవచ్చు.
◼ అలాగే బోరు బావి సామర్ధ్యం బాగా వుండి మోటారు చెడిపోయి గాని ఇతర కారణాల వలన పనిచేయలేకపోతే అవసరమైన మరమ్మత్తులు చేయించి బోరును వినియోగంలోకి తీసుకురావాలి.
◼ బోరు బావి ఉండి, మంచి నీటి సరఫరా పథకం అందుబాటులో లేనప్పుడు, బోరు బావి నీటిని RWS ల్యాబ్ లో ఈ
క్రింద పరిక్షలు చేయాలి.
     ◾ PH విలువ
     ◾ అల్కలానిటి
     ◾ Hardness
     ◾ ఫ్లోరైడ్
     ◾ క్లోరైడ్
     ◾ సల్ఫేట్
     ◾ ఐరన్
          ◾ నైట్రేట్
          ◾ TDS
          ◾ E Coli
          ◾ Coliform
◼ నీటి పరీక్ష ద్వారా వచ్చిన విలువలను CRP లు Mobile App ద్వారా STMS లో అప్ లోడ్ చేయాలి.
◼ నీటి పరీక్షకు సంబంధించిన ఖర్చులను నాడు-నేడులో చేసుకోవచ్చును.
మంచినీటి సరఫరా పథకం అందుబాటులో లేని అలాగే బోరు వేస్తే నీరు పడని పాఠశాలలు:
◼ ఇలాంటి పాఠశాలలో సంపు నిర్మాణము చేసి ట్యాంకర్ల ద్వారా సంపును నీటితో నింపుకోవాలి
◼ సంబంధిత మండల RWS ఇంజనీరు మరియు మండల విద్యాశాఖాధికారి ఇలాంటి పాఠశాలలను ధృవీకరించాలి.
సంపు నిర్మాణము:
◼ పంచాయతి /మునిసిపల్ కుళాయి ద్వారా నీటి సరఫరా వున్నప్పుడు నీటిని నిల్వ చేసుకోవడానికి సంపు నిర్మించుకోవాలి.
◼ విద్యార్థుల సంఖ్య ఆధారంగా 3000 లీటర్ల  నుండి  5000 లీటర్ల  సామర్ధ్యం కలిగిన RCC సంపులను నిర్మించుకోవాలి.
సంపు కొలతలు:
3000 లీటర్లకు పొడవు 6 అ; వెడల్పు 5 అ; ఎత్తు 4 ;
4000 లీటర్లకు పొడవు 8 అ; వెడల్పు 5 అ; ఎత్తు 4 ;
5000 లీటర్లకు పొడవు 10 అ; వెడల్పు 5 అ; ఎత్తు 4 ;
◼ సంపు గోడ మందము 4 ఇంచుల నుండి 5 ఇంచులు ఉండాలి.
◼ సంపును కాంపౌండ్ గోడకు సమాంతరంగా, భూమిలోనికి ఒక అడుగులోతు వరకు నిర్మించుకోవాలి.
◼ సంపు పై భాగాన్ని RCC స్లాబుతో గాని, కడప స్లాబ్ బండలతో గానీ కవరు చేయాలి .
◼ సంపులోనికి దిగి సంపును శుభ్రం చేయడానికి స్లాబ్ లో 0.60 మి. X 0.60 మి. ఓపెనింగు వుంచి దానికి ఐరన్ గ్రిల్ ను బిగించి లాక్ చేయాలి.
◼ సంపును కడిగినప్పుడు నీరు పూర్తిగా బయటికి వెళ్ళడానికి , scour పైపు , సంపు నిండిన తరువాత నీరు బయటకు వెళ్ళడానికి overflow పైపు బిగించాలి.
◼ సంపు నుండి టాయిలెట్ విభాగానికి , త్రాగు నీటి ట్యాంకుకు నీరు పంప్ చేయడానికి 0.5 HP మోటారును బిగించుకోవాలి. ( Texma, CRI కంపెనీ మోటార్ లను కొనుక్కోవాలి).
◼ టాయిలెట్ విభాగానికి, త్రాగునీటి ట్యాంకుకు విడివిడిగా పైపు లైనులు వేసుకోవాలి.
◼ సంపును నెలలో కనీసం రెండు సార్లు శుభ్రపరచుకోవాలి.
◼ విద్యార్థులు లేదా ఇతరులు సంపు మీదకు ఎక్కకుండా, సంపులోనికి దిగకుండా సరైన లాక్ అండ్ కీ పద్ధతిని అవలంబించాలి.
త్రాగు నీటి వసతి ఏర్పాటు:
◼ బోరుబావి నీరు కాని,కుళాయి నీరును గాని నేరుగా త్రాగడానికి వాడకుండా బ్యాక్టీరియాను, అవసరంలేని ఖనిజ లవణాలను తొలగించాలి.
◼ ఇలా శుభ్రపరిచిన నీటిని విద్యార్థుల త్రాగునీటి అవసరాల కోసం ప్రత్యేకమైన వసతిని కల్పించాలి.
◼ ఇందుకోసం ఎత్తులో ఒక stainless స్టీల్ ట్యాంకును అమర్చి, బ్యాక్టీరియాను తొలగించడానికి Ultra Violet (UV) Aqua ఫిల్టరు ద్వారా నీటిని పంపించి,  శుభ్రపరచిన నీటిని క్రింది ఉన్న మరొక stainless స్టీల్ ట్యాంకులో నిల్వ చేసుకోవాలి.
◼ ఇకముందు త్రాగునీరుకు సంబంధించి RO ( Reverse Osmosis) యూనిట్ పెట్టకూడదు. RO పద్దతిలో త్రాగు నీటిలో ఉండే శరీరానికి కావలసిన మినరల్స్ (ఖనిజ లవణాలు ) పూర్తిగా వడ గట్ట బడతాయి.భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారము total dissolved soiled తక్కువలో తక్కువ 500 ఉండాలి. RO పద్దతిలో ఈ ఖనిజ లవణాలు 20-30 కి వడగట్ట బడతాయి.
◼ క్రింద వున్న స్టీల్ ట్యాంకు నుండి శుభ్రపరచిన తాగు నీటిని కుళాయిల వరుస ద్వారా గోడ బయట నుండి విద్యార్థులు తమ బాటిల్స్ లో తాగునీటిని పట్టుకుంటారు.
◼ కుళాయిల సంఖ్య ప్రతి 15 మందికి ఒక కుళాయి చొప్పున ఉండాలి.
◼ నీటి నిల్వ కోసం గది పై భాగంలో అమర్చిన stainless స్టీల్ ట్యాంకు సామర్థ్యము 600 లీటర్ల నుండి 1000 లీటర్ల వరకు వుండవచ్చు.
◼ గది పై భాగంలో అమర్చిన stainless స్టీల్ ట్యాంకుకు ఎండ వేడి తగలకుండా సరైన ఏర్పాట్లు చేసుకోవాలి.
◼ శుభ్రపరచిన నీటిని నిల్వ కోసం క్రింద అమర్చిన stainless స్టీల్ ట్యాంకు సామర్థ్యము 200 లీటర్ల నుండి 300 లీటర్ల వరకు ఉండాలి. ( ఒక్కొక్క విద్యార్థికి రెండు లీటర్ల చొప్పున ).
◼ ప్రతి 30 నుండి  150 మంది విద్యార్థుల వరకు నీటిని శుభ్రపరచే ఒక యూనిట్ ఉండాలి. 150 సంఖ్య దాటితే అదనంగా ఒక యూనిట్ ఉండాలి.
◼ ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు అవసరం అయినప్పుడు వేరువేరు బిల్డింగ్ బ్లాక్ లలో ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థుల సంఖ్య 30 కంటే తక్కువ ఉంటే stand alone ఫిల్టర్లు వాడాలి.
◼ ఈ త్రాగునీటి విభాగాన్ని పాఠశాల వరండా చివర్లో రెండు మీటర్ల వెడల్పుతో అమరిక చేసి విద్యార్థులు ఇతరులు వెళ్ళకుండా ఇనుప గ్రిల్ డోరును ఏర్పాటు చేయాలి.
◼ స్టీల్ ట్యాంకులను నెలలో కనీసం రెండు సార్లు శుభ్రం చేయాలి.
◼ త్రాగునీటి కుళాయిల దగ్గర ఎట్టి పరిస్థితులలో చేతులు, ప్లేట్లు కదగరాదు. ఇలా కూడా కాకుండా ఒక stainless stand grill కుళాయిల చుట్టూ పెట్టవలెను.
◼ స్టీల్ ట్యాంకులు, UV Aqua ఫిల్టరు కమీషనరు టెండరు ద్వారా నిర్ణయించిన సరఫరాదారుడు నుండి సరఫరా చేస్తాం.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top