Warning: Constant WP_AUTO_UPDATE_CORE already defined in /home/u833945783/domains/teachersportal.in/public_html/wp-config.php on line 99
Teachers must attend schools to clear the Bridge Course students doubts Orders Issued By D.E.O, Kurnool – Teachers Portal

Teachers must attend schools to clear the Bridge Course students doubts Orders Issued By D.E.O, Kurnool

బ్రిడ్జ్ కోర్సు / టివి పాఠాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయుటకు ఉపాధ్యాయులు వారానికోసారి పాఠశాలలకు వెళ్ళాలి….
కమీషనర్ పాఠశాల విద్యాశాఖ అమరావతి వారి ఉత్తర్వుల ప్రకారం 10.06.2020 నుండి Bridge Course / TV పాఠాలు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి  విద్యార్థులకు దూరదర్శన్ ( సప్తగిరి చానల్ ) ద్వారా పాఠాలు ప్రసారం చేయు విషయం విదితమే.
◼ 1,2 తరగతులకు ఉదయం 11.00 గంటల నుండి 11.30 గంటల వరకు
◼ 3,4,5 తరగతులకు ఉదయం 11.30 గంటల నుండి 12.00 గంటల వరకు
◼ 6,7 తరగతులకు మధ్యాహ్నం 02.00 గంటల నుండి 03.00 గంటల వరకు
◼ 8,9 తరగతులకు మధ్యాహ్నం 03.00 గంటల నుండి 04.00 గంటల వరకు
TV ద్వారా బ్రిడ్జ్ కోర్సు పాఠాలు మరియు TV పాఠాలు ప్రసారం అవుతున్నాయి. టివి పాఠాలు లేదా మొబైల్ నెట్వర్క్  లకు అవకాశం లేని పిల్లలకు నేర్చుకోవటానికి వీలుగా ఉపాధ్యాయులు 16.06.2020 నుండి వారానికోసారి పాఠశాలలకు హాజరై  విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయాలి.
వీడియో తరగతుల ద్వారా విద్యార్థులకు ఇవ్వబడిన వర్క్ షీట్ లను వారు సరిగా చేస్తున్నారో ఉపాధ్యాయులు విధిగా పరిశీలించాలి.
విద్యార్థులు వారి వర్క్ షీట్ లను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి రికార్డు రూపంలో తదుపరి తనిఖీ కొరకు నిర్వహించాలి.
విద్యార్థుల తల్లిదండ్రులు వారియొక్క పిల్లల వర్క్ షీట్స్ లను వ్రాసేటట్టు మరియు వాటిని సంబంధిత ఉపాధ్యాయునికి అందచేయునట్టు చైతన్య పరచాలి.
ఉపాధ్యాయులు ( ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత ) 16.06.2020 నుంచి ఈ క్రింది విధంగా  పాఠశాల పూర్తి పనివేళల ప్రకారం పాఠశాలలకు తప్పక హాజరు కావాలి.
◼ ప్రాథమిక ఉపాధ్యాయులు ( 1 – 5 తరగతులు ) – ప్రతి మంగళవారం
◼ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల  ఉపాధ్యాయులు ( 6 – 7 తరగతులు ) – ప్రతి బుధవారం
◼ ఉన్నత పాఠశాలల  ఉపాధ్యాయులు ( 8 – 9 తరగతులు ) – ప్రతి శుక్రవారం
◼ ఉన్నత పాఠశాలల  ఉపాధ్యాయులు (10 వ  తరగతి ) – ప్రతి బుధవారం మరియు శుక్రవారం.
ప్రతి పాఠశాలలో సంబంధిత రోజులలో స్ఫూర్తివంతంగా అమలు చేయడానికి తగిన చర్యలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీసుకోవాలి.
కావున పై తెలిపిన ప్రభుత్వ ఆదేశాలను అన్నీ యాజమాన్య పాఠశాలల  ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తప్పక పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ.యం.సాయిరామ్ గారు ఆదేశించడమైనది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top