AndhraPradesh Government Life Insurance (APGLI)
ఈ పథకము 01-11-1956 వ సంవత్సరము నుండి ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉంది. 01-11-1998 నుండి G.O.Ms.No : 211 , Date: 17-12-1997 ప్రకారం పంచాయితీరాజ్ ఉద్యోగులకు కూడా వర్తింపచేశారు.
ఈ పథకము G.O.Ms.No: 25 , Date:03-03-2011 ద్వారా 01-03-2011 నుండి మున్సిపల్ ఉపాధ్యాయులకు
( విజయవాడ,విశాఖపట్నం,హైదరాబాద్ మినహా ) వర్తింప చేయబడినది. G.O.Ms.No : 137 , Date: 21-10-2015 ద్వారా విజయవాడ,విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్లకు కూడా వర్తింపచేశారు.
అర్హతలు :
- 21 సం.లు 55 సం.లు మధ్య వయస్సు వున్న వారందరూ ఈ పథకములో సభ్యులు కావాలి.
- ఉద్యోగములో చేరిన మొదటి నెల నుంచే ప్రీమియం మినహాయించాలి.(G.O.Ms.No: 199 ,Date: 30-07-2013 )
- ప్రీమియం చెల్లించిన నెలలోనే దరఖాస్తును కూడా పంపాలి, లేనిచో రిస్క్ కవర్ కాదు.
- 55 సం..లలోపు ప్రీమియం మినహాయించినప్పటికీ, 55 సం..లు దాటినా తరువాత దరఖాస్తు పంపినచో అంగీకరించబడదు. G.O.Ms.No: 36 , Date: 05-03-2016 ద్వారా మార్చి 2016 నుండి 53 సం. వయస్సును 55 సం..లకు పెంచబడినది.
- G.O.R.T: 1604 , ఫైనాన్స్ ప్లానింగ్ Date: 05-12-1978 మేరకు పాలసీ హోల్డరు అఫిడవిట్ మేరకు మిస్సింగ్ క్రెడిట్స్ ను డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సరిచేయాలి.
ప్రీమియం :
నెలసరి మూలవేతనమునువేట బట్టి ప్రీమియంను చెల్లించాలి.పెరిగిన వేతనమును బట్టి ప్రీమియంను కూడా పెంచాలి.మూలవేతనములో 20% నకు మించకుండా ప్రీమియంను ముందుగానే పెంచుకొనవచ్చును.మొదటి ప్రీమియం తప్పనిసరిగా నిర్ణీత స్లాబు ప్రకారమే ఉండాలి.అన్ని పాలసీల మెచ్యురిటి విలువ 10లక్షలు దాటిన సందర్భంలో మాత్రమే Good Health Cerficate జత చేయాలి. ఆదాయపు పన్ను లెక్కింపులో ప్రీమియం మొత్తంపై పన్ను రిబేటు ఇవ్వబడుతుంది.సర్వీసులో ఉండగా శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.30/-ల వరకు ప్రీమియంలో మినహాయింపు వర్తిస్తుంది.
బోనస్ :
- సాధారణ L.I.C కంటే ఈ పథకములో చెల్లించే బోనస్ ఎక్కువ. 1993-1996 కాలమునకు ప్రతి రూ.1000/- లకు రూ.105/- లు బోనస్ మరియు రూ.5/- టెర్మినల్ బోనస్ చెల్లించబడుతుంది.
- 01-04-1996 నుండి 31-03-2002 వరకు 10%, 01-04-2002 నుండి 31-03-2005 వరకు 11%, 01-04-2005 నుండి 10% బోనస్ చెల్లించబడుతుంది.
అప్పు :
ఈ పాలసీలో నిల్వవున్న మొత్తం ( Paid Up Value + Bonus )లో 90% అప్పుగా ఇస్తారు.
నామినేషన్ :
ఇతర పథకాలలో నామినేషన్ భార్యా పిల్లలకే ఇవ్వాలి. ఈ పథకములో కొంత శాతమును తల్లిదండ్రులకు, అక్కాచెల్లెండ్లకు,అన్నదమ్ములకు కూడా కేటాయించవచ్చును.
పి.ఆర్.సి.2015 ప్రకారం స్లాబ్ రేట్లు
( జి.ఓ .నం:36 , తేదీ : 05-03-2016 )
మూలవేతనం | ప్రీమియం |
---|---|
13000 – 16400 | Rs.500/- |
16401 – 21230 | Rs.650/- |
21231 – 28940 | Rs.850/- |
28941 – 35120 | Rs.1150/- |
35121 – 49870 | Rs.1400/- |
49871 ఆ పైన | Rs.2000/- |