పాఠశాల సంచాలకులు,ఏ.పి. అమరావతి వారి ఆదేశాల మేరకు , జిల్లాలోని అన్ని ఉప విద్యాశాఖాధికారులకు మరియు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడమేమనగా , డి.యస్.సి. 2003 నందు ఎంపిక కాబడి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల వివరాలను నిర్దేషించినటువంటి ప్రొఫార్మాలో పొందుపరచి తేదీ : 27.05.2020 లోగా జిల్లా విద్యాశాఖాధికారి , కర్నూల్ వారి మెయిల్ deoknl@gmail.com నకు దృవీకరించి సమర్పించవలసినదిగా ఆదేశించడమైనది.
మరియు డి.యస్.సి 2003 నందు ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడి , ప్రభుత్వ రిక్రూట్మెంట్ నందు ఇతర పోస్టులకు ఎంపిక కాబడి రిలీవై వెళ్లి ప్రస్తుతం ఇతర శాఖలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమాచారమును ర్దేషించినటువంటి ప్రొఫార్మాలో పొందుపరచి తేదీ : 27.05.2020 లోగా సంబంధిత డి.డి.ఓ. ల ద్వారా దృవీకరించి , ఉప విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాశాఖాధికారులు జిల్లా విద్యాశాఖాధికారి , కర్నూల్ వారి మెయిల్ deoknl@gmail.com నకు సమర్పించవలసినదిగా ఆదేశించడమైనది.
తేదీ 27.05.2020 అనంతరం వచ్సినటువంటి విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకోనబడవు.